BREAKING: ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు
ప్రభుత్వ మార్పిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ మార్పిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తాజాగా ఏపీ సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీంతో ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు ఎండ్ కార్డ్ పడింది. కాగా, జగన్ నేతృత్వంలోని అప్పటి వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న టీడీపీ, జనసేన.. తాము అధికారంలోకి రాగానే ఈ యాక్ట్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏపీలో వైసీపీ ఓటమి పాలై.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసే ఫైల్‌పై సంతకం చేశారు.
Read More...