న్యూ ఇయర్ పార్టీలో అశ్లీల నృత్యాలు.. రాష్ట్రంలో మరోసారి రేవ్ పార్టీ కలకలం
రాష్ట్రంలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో న్యూ ఇయర్ వేళ నిర్వహించిన రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనసేన నేత వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో జరిగిన న్యూయర్ వేడుకల్లో మహిళలు, హిజ్రాలు అశ్లీల నృత్యాలు ప్రదర్శించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. డిసెంబర్ 31 రాత్రి వేడుకలు జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో మండపేట టౌన్ పోలీసులు జనసేన నాయకుడితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఇది వైసీపీ నేత నిర్వహించిన పార్టీ అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.