AP News:లడ్డూ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలపై స్పందించిన పురంధేశ్వరి

ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.

Update: 2024-10-01 10:19 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆయా సమస్యలపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఆమె అన్నారు. సీఎం అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాత తిరుమల లడ్డూ విషయం పై మాట్లాడి ఉంటారని ఆమె తెలిపారు.

లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే చంద్రబాబు మాట్లాడారని తెలిపారు. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదని అన్నారు. సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అనడం సరికాదు.. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో లడ్డూ విషయంలో న్యాయస్థానంలో కూడా విచారణ జరుగుతుందని ఆమె తెలిపారు. వివిధ సమస్యల పై ప్రజలు విజ్ఞాపన పత్రాలు అందిస్తున్నారని అన్నారు. సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తున్నామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.


Similar News