ప్రజాభిమానం ఉన్న నేత పవన్ కల్యాణ్ : Bandi Sanjay
భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏలో చేరారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏలో చేరారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. పవన్ కల్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత అని కొనియాడారు. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణం, దుర్మార్గం అని బండి సంజయ్ అన్నారు. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారు అని బండి సంజయ్ మండిపడ్డారు. విలువలతో నడుస్తూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కే యత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఆ సంస్థలకు కులాన్ని, వ్యక్తులకు అంటగడుతున్నారు అని బండి సంయజ్ ధ్వజమెత్తారు. మరోవైపు ‘రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు వెంకన్న భక్తులు. శివాజీ, అంబేద్కర్, మోడీ వారసులు మీరు. ధర్మం కోసం పనిచేసే వాళ్లు. రామరాజ్య స్థాపన కోసం పనిచేసే వాళ్లు. ఓటర్ నమోదు కార్యక్రమంతోపాటు ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలి’ అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
Read More : తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే: ఎంపీ బండి సంజయ్ ఫైర్