Tirupati Ysrcp: మరో బిగ్ షాక్.. కార్పొరేటర్ల రహస్య భేటీ

తిరుపతిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ...

Update: 2024-07-21 10:19 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ మార్పు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. కనీసం ప్రతిపక్షం హోదా కూడా దక్కలేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుత్సాహంలో ఉన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచి ఐదేళ్ల పాలనలో ఎంతో వైభవాన్ని అనుభవించారు. ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో భవిష్యత్తుపై తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి పనులు జరగలన్నా అధికార పార్టీ చేయాల్సిందే. దీంతో పార్టీ మారే యోచనలో చాలా నియోజకర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో క్రమంగా పార్టీ పట్టుకోల్పోతోందని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. దీంతో కూటమి ఎమ్మెల్యే వెంట ఉంటే భవిష్యత్తు ఉంటున్నదనే ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తిరుపతి పట్టణం అభివృద్ధికి సంబంధించి నిధులు విడుదల కావాలంటే కూటమి ప్రభుత్వానికి జై కొట్టక తప్పదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేనల్లో ఏదో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తిరుపతి మున్సిపాలిటీలో కూటమి బలం తక్కువగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకోవడంతో తిరుపతి మున్సిపాలిటీపై జెండా ఎగురవేయొచ్చనే ఆలోచన టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీకి సమాచారం ఇవ్వకుండా కొందరు వైసీపీ కార్పొరేటర్లు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీలో చేరారా.. జనసేనలోకి వెళ్లాలా అనే చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ కార్పొరేటర్లు టీడీపీ, వైసీపీ గూటికి చేరారు. ఇటు తిరుపతిలోనూ అదే జరుగుతుందని అంటున్నారు.  దీంతో  తిరుపతి రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Tags:    

Similar News