శ్రీకాకుళంలో వ్యక్తి నుంచి రూ. 29 లక్షలు పట్టివేత
ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ...
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినా భారీగా నగదు తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎన్నికల స్వ్కాడ్ అధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. భారీగా నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. బస్సులో వెళ్తున్న వ్యక్తి వద్ద సోదాలు చేశారు. వ్యక్తి నుంచి రూ. 29.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. అనుమతులు లేకుండా నగదు, బంగారం, వెండి, చీరలు, ప్రచార సామాగ్రిని తరలించొద్దని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.