సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు.. ఎంపీ అవినాష్‌ పీఏ రాఘవ ఇంటికి పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సోషల్ మీడియా(Social media) వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Update: 2024-11-09 02:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సోషల్ మీడియా(Social media) వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు.. వైసీపీ ఎంపీ అవినాష్‌(MP Avinash PA) పీఏ(PA) రాఘవ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వైఎస్ భారతి(YS Bharti) పీఏ వర్రా రవీంద్ర(Varra Ravindra)తో రాఘవ చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఇదే విషయంపై పులివెందుల పోలీసులు రాఘవ తండ్రితో మాట్లాడారు. రాఘవను విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే రాఘవ వచ్చిన తర్వాత సమాచారమిస్తానన్న లాయర్‌ చేప్పడంతో పోలీసులు ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే టీడీపీ(TDP) శ్రేణులు మాత్రం పోలీసులకు భయపడి తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపిస్తున్నారు.


Similar News