AP News:అలాంటి కాంట్రాక్టర్లు బ్లాక్‌లిస్ట్‌లోకే.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు.

Update: 2024-11-12 14:40 GMT

దిశ, ఏలూరు సిటీ: జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి, పర్యవేక్షించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో సీసీ రోడ్డు పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో లింక్ రోడ్లను సీసీ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. రోడ్డు నిర్మాణ పనులను ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా పూర్తి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేయాలన్నారు, పనులను సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్, తదితర అంశాలను పంచాయతీరాజ్, డ్వామా అధికారులు కలెక్టర్ కు వివరించగా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట పంచాయతీ రాజ్ ఇంచార్జి ఎస్ఈ రమణమూర్తి, డీఈ శ్రీనివాసరావు, ఏఈ మురళి, ఎంపీడీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Similar News