ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు..తాయిళాలకు కాలం చెల్లింది:పులివర్తి సుధారెడ్డి

నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, తాయిళాలకు కాలం చెల్లిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి అన్నారు.

Update: 2024-03-08 13:28 GMT

దిశ, చంద్రగిరి: నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, తాయిళాలకు కాలం చెల్లిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం రామచంద్రపురం మండలంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. రామచంద్రపురం మండలం లో ప్రజల నుంచి ఎన్నడూ చూడని స్పందన, ఆదరణ లభిస్తుందన్నారు. ప్రతి ఇంటి తోబుట్టువులా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పై ప్రతి ఒక్కరు అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు.

ప్రజలతో మా ప్రయాణాన్ని ఇలాగే సాగిస్తామన్నారు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఇంత చైతన్యవంతంగా ఉండడం శుభపరిణామం అన్నారు. ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా భర్త పులివర్తి నాని లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు మహాశక్తి పేరిట నాలుగు పథకాల్ని చంద్రబాబు ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రతి నెలా 1500 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో వేస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద చదువుకుంటున్న పిల్లల తల్లులకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15 వేల రూపాయల చొప్పున ఈ పథకం కింద అందజేస్తారని అన్నారు. అలాగే ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు తొలి మేనిఫెస్టోలో ప్రకటించారని చెప్పారు. మహిళలకు జిల్లాలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.


Read More..

మహిళలకు టీడీపీ గుడ్ న్యూస్.. త్వరలో సరికొత్త పథకం

Tags:    

Similar News