ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఆగ్నేయ (Southeast) బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) కారణంగా రెండు రోజుల్లో వాతావరణం (weather)మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2024-12-16 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆగ్నేయ (Southeast) బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) కారణంగా రెండు రోజుల్లో వాతావరణం (weather)మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు ( rains) పడే సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపు నెల్లూరు (Nellore), తిరుపతి (Tirupati) జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ ప్రాంతాలైన కోస్తా, రాయలసీమలో (Rayalaseema) తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. తీరా ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News