పోలవరం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. డివాల్ నిర్మాణ పనులు పరిశీలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( CM Chandrababu)సోమవారం పోలవరం (Polavaram)లో పర్యటిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( CM Chandrababu)సోమవారం పోలవరం (Polavaram)లో పర్యటిస్తున్నారు. ఇందుకుగాను అధికారులు, మంత్రులు, పోలీసులు ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. గెస్ట్ హౌస్ వరకు హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం.. ఆ తర్వాత రోడ్డు మార్గంలో.. ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకొని పోలవరం డ్యామ్(Polavaram Dam)ను పరిశీలించారు. అనంతరం గ్యాప్-1, గ్యాప్-2, డివాల్ నిర్మాణ పనులు (Dewall construction works) వైబ్రో కంపాక్షన్ పనులు (Vibro compaction works) పరిశీలించారు. అనంతరం సదరు నిర్మాణ పనులు ఇతర అంశాలపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో సీఎం చంద్రబాబు నాయడు సమీక్షించ నిర్వహించారు. 2027 వరకు పనులు పూర్తవ్వాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.