Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ (YCP) కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది.

Update: 2024-12-16 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. పోక్సో చట్టం (Pocso Act) కింద తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఇటీవలే ఆయన ఏపీ హైకోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌లో భాస్కర్‌ రెడ్డి (Bhaksar Reddy)కి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ.. ఎలాంటి మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, తిరుపతి (Tirupati) జిల్లా యర్రావారిపాలెం (Yarravaripalem) మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం వార్తలను సోషల్ మీడియా (Social Media)లో ప్రసారం చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు చెవిరెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News