Nara Lokesh:‘గత విధ్వంస పాలనను ప్రజలు తరిమికొట్టారు’.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

ఏపీ ప్రజలందరికీ విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2025-01-01 08:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలందరికీ విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు తీసుకురావాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు అందరికీ ‘హ్యాపీ న్యూ ఇయర్’(Happy New Year) అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. గడిచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారు అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి(Development) పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలు మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News