మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి పట్టం.. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు పట్టం కట్టారు...
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ఎన్నికల్లో(MaharashtraElection2024) ఎన్డీయే కూటమి హవా సాగింది. ఇవాళ విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అధికారం దిశగా దూసుకుపోతోంది. దాదాపుగా ఎన్డీయే కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి(Ap Bjp Chief Purandheswari) స్పందించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అద్భుతమైన విజయం సాధించినట్లేనని తెలిపారు. 288 స్థానాల్లో 220పై చిలుకు సీట్లలో కూటమి గెలుస్తోందని చెప్పారు. జార్ఖండ్ ఫలితాలపై సమీక్షించుకుంటామని తెలిపారు. జార్ఖండ్ అభివృద్ధికి బీజేపీ(Bjp) సహకరిస్తుందన్నారు. దేశాన్ని, సమాజాన్ని విభజించు అనే ధోరణితో పని చేస్తున్న కాంగ్రెస్ విధానాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని పురంధేశ్వరి విమర్శించారు.
‘‘గడిచిన 10 ఏళ్లలో ఎన్డీయే కూటమి సుపరిపాలన అందించింది. అవినీతి రహిత పాలన చేసింది. దేశాన్ని అభివృద్ధి చేసింది. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ భారతదేశ ఔన్యత్యాన్ని పెంచారు. అభివృద్ధికి పెద్ద పీట వేశారు. అందుకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. దేశాభివృద్ధిని మరిచి కేవలం బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఇండియా కూటమి పని చేసింది. ఇండియా కూటమి సిద్ధాంతాలను, వారి ఆలోచన విధానాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరుస్కరించారు. ఎన్డీయే కూటమి దేశాభివృద్ధికోసం పని చేస్తోంది. అందుకే ప్రజలు పట్టంకట్టారు.’’ అని పురంధేశ్వరి పేర్కొన్నారు.