Breaking News:రూటు మార్చిన జనసేనాని..పొత్తు పై పవన్ సంచలన వ్యాఖ్యలు..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి

Update: 2024-02-04 09:55 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమ ఆధిక్యాన్ని చూపించాలని ఉబలాట పడుతోంది. అయితే అధికార పార్టీ అధికారం చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక జనసేన టీడీపీతో పొత్తు కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అయితే వైసీపీ నేతలు టీడీపీ జనసేన పొత్తు పైన పలు విమర్శలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఇక X వేదికగా కొడాలినాని పొత్తుచిత్తు అనే వీడియోని కూడా విడుదల చేశారు. వైసీపీ నేతలు అన్నట్టుగానే పొత్తు పొసగక టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చెయ్యనున్నారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విరాల్లోకి వెళ్తే.. టీడీపీతో జనసేన పొత్తు మూడు నాళ్ళ ముచ్చటే అని తేలిపోయింది. తనకు గౌరవం ఇవ్వని వాళ్ళతో కలిసిపని చెయ్యలేనంటూ కుండబద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్.

రానున్న ఎన్నికల్లో పొత్తు లేకుండానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు తిరుపతి లో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారాయి. రానున్న ఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీ చేసేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తమకు గౌరవం ఇవ్వని వారితో కలిసి పనిచెయ్యలేమని స్పష్టం చేశారు.

ఇక గతంలో తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటె మూడవ ప్రత్యామ్నాయం ఉండేదని ప్రస్తుతం అది కూడా లేకుండా పోయిందని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇక తనకి నిర్మాణాత్మక రాజకీయాలను ఇష్టమని తాను విధ్వంసక రాజకీయాలను ఇష్టపడని తెలిపారు. అయితే తనకి ఎవరితో సంబధం లేదని తెలిపిన ఆయన.. జనసేన టీడీపీకి కొమ్ముకాస్తోందని వైసీపీ మాట్లాడుతోందని.. అంటే రేపు వైసీపీకి మద్దతు ఇస్తే ఒకే నా అని ప్రశించారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో హలచల్ చేస్తోంది.

అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు. ఎప్పుడో గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో టీడీపీ, జనసేన మధ్య పొత్తు మూడునాళ్ళ ముచ్చటగా ముగిసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. త్వరలోనే సీట్ల కేటాయింపు పై తుది నిర్ణయం తీసుకుంటున్నారు.

Read More..

Big Breaking: దూకుడు పెంచిన టీడీపీ-జనసేన..త్వరలో ఉమ్మడి భారీ బహిరంగ సభ 

Tags:    

Similar News