‘మతం మంటలు రేపాలని చూస్తున్నారు..’ జగన్‌పై పవన్ సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-09-27 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. తుని, కోనసీమ ఘటనలతో వైసీపీ కులాల చిచ్చు రగిలించడానికి ప్రయత్నిస్తోందని, ప్రజల్లో మతం మంటలు రేపాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సూదీర్ఘ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లోనే జగన్ డిక్లరేషన్ గురించి కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ డిక్లరేషన్ సంగతి టీటీడీ చూసుకుంటుందని, డిక్లరేషన్ ప్రక్రియపై ఎవ్వరూ అతిగా మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం వైసీపీ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నందున పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తుల్ని, ఇతర మతాలని లక్ష్యంగా చేసుకోవద్దంటూ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులు అన్యమతస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచించారు. ఒకవేళ హిందువులు అలా చేస్తే వైసీపీ ప్లాన్ సక్సెస్ అయినట్లేనని, ఆ పార్టీ ప్లాన్ సక్సెస్ కానివ్వకూడదని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కాగా.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో తిరుపతిలో నిరసనలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీంతో కార్యకర్తలంతా జగన్ డిక్లరేషన్‌పై సైలెంట్ అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.


Similar News