Breaking: ఎంతైనా సీఎం జగన్ మామయ్య తీరే అంతరా బై.. ఏమంటావ్..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Update: 2024-02-21 10:28 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటలు తూటాల్లా పేలడమే కాదు.. సోషల్ మీడియాని విమర్శల యుద్దభూమిగా మార్చేశారు. ముఖ్యంగా ట్విట్టర్ (X) వేదికగా ఒకరిపై మరొకరు మాటల అస్త్రాలను గురితప్పకుండా సంధిస్తున్నారు. ఇక జగన్ ప్రతిపక్ష నాయకులపై పంచ్ డైలాగులను విసురుతుంటే.. ప్రతిపక్ష నేతలు జగన్ ప్రతి అడుగును గమిస్తూ.. ప్రతి మాటను ఆలకిస్తూ.. సూది మొనలో సూక్ష్యం పట్టినట్టు జగన్ వేసే అడుగుల్లో అవకతవకలను వెతికి మరీ విమర్శిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ ట్విట్టర్ (X) లో ఓ పోస్ట్ చేసింది.

మీమయ్య అనే వైఎస్ జగన్ రెడ్డి సొంత మేనల్లుడి వివాహానికి డుమ్మా కొట్టి బాధ్యత విస్మరించాడని.. అతను ఉట్టి మామ కాదు "కంస" మామ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కంస మామ పెళ్ళిలో కాదు చెరసాలలో ఉండాని ఒకరు కామెంట్ చేయగా.. అంటే అదీ రాజధాని కట్టడంలో బిజీ అయిపోయి, భూమ్ భూమ్ అని మందు తాయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే సేవలో పడిపోయి మర్చిపోయాడు.

ఫాఫం కంస మామ జలగక్క అని మరొకరు కామెంట్ చేసారు.. ఎంతైనా సీఎం జగన్ మామయ్య తీరే అంతరా బై.. ఏమంటావ్..? పవన్ కళ్యాణ్ చెప్తే ఇలానే ఉంటుందని అనుకుంటున్నా అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. అయితే మరొకరు మాత్రం జగన్ ని సమర్ధిస్తూ మీ మూడు పెళ్లిళ్ల గురించి అంటేనెమో వ్యక్తిగత విషయాలు అంటావ్.. మరి వాళ్ళ కుటుంబ విషయాలు నీకు ఎందుకు..? అని కామెంట్ ద్వారా ప్రశ్నించారు.

Tags:    

Similar News