చర్యలు తీసుకోండి: సీఐ అంజుయాదవ్‌పై Pawan Kalyan ఫిర్యాదు
జనసేన కార్యకర్త కొట్టే సాయిపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన కార్యకర్త కొట్టే సాయిపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పవన్ కల్యాణ్ కోరారు. సీఐ అంజూయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాన్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో 15 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతి ఎస్పీ కార్యాలయం వరకు దారి పొడవునా జనసేనా పవన్ కల్యాణ్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుపతి ఎస్పీ కార్యాలయం చేరుకున్న పవన్ సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న కొట్టే సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జనసేన కార్యకర్త కొట్టే సాయిపై సీఐ చేయి చేసుకున్న దానిని వివరించారు. సీఐ దాడికి సంబంధించిన వీడియోను సైతం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పవన్ కల్యాణ్ అందజేశారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ రాకముందే సీఐ అంజూయాదవ్‌పై ఎస్పీ సీరియస్ అయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు సీఐ అంజూ యాదవ్‌కు చార్జ్ మెమో జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి డీజీపీకి నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: Jana Sena Chief Pawan Kalyan : తిరుపతికి పవన్ కల్యాణ్..తరలివచ్చిన జనసైనికులు