Pawan Kalyan: ఎంపీడీవోపై వైసీపీ నేతల దాడి.. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు (MPDO Jawahar Babu)పై దాడి రాష్ట్ర వ్యా్ప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-12-28 06:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు (MPDO Jawahar Babu)పై దాడి రాష్ట్ర వ్యా్ప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఘటనపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనను కూటమి సర్కార్ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని ఫైర్ అయ్యారు. ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని అన్నారు. అదేవిధంగా దాడికి కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీవో జవహర్ బాబుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.  

Tags:    

Similar News