11 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ వారాహి అమ్మవారి దీక్ష.. ఏం ఆహారం తీసుకోనున్నారంటే?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. అంటే జూన్ 26 వ తారీకు నుంచి పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభించనున్నారు. కాగా ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. ఈ దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారట. గత సంవత్సరం జూన్ నెలలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత పవన్ 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. గత పదేళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను, సవాళ్లను ఎదుర్కొన్న జనసేనాని వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారు. ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ అపజయాలు చవిచూసిన వెనకడుగు వేయకపోవడం విశేషం.