Tirupati Stampede : తిరుపతికి చేరుకున్న పవన్‌కల్యాణ్
తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) దర్శన టోకెన్ల జారీలో బుధవారం రాత్రి తొక్కిసలాట(Stampede) జరిగి ఆరుగురు మృతి చెందగా.. పలువురు ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) దర్శన టోకెన్ల జారీలో బుధవారం రాత్రి తొక్కిసలాట(Stampede) జరిగి ఆరుగురు మృతి చెందగా.. పలువురు ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Deputy CM Pavan Kalyan) కొద్దిసేపటి క్రితం తిరుపతి చేరుకున్నారు. తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల, పద్మావతి పార్క్ స్థలాన్ని పవన్ కల్యాణ్ సమీక్షించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. టోకెన్ల జారీలో భద్రతా ఏర్పాట్లు, తొక్కిసలాటకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో బాధితులు చికిత్స పొందుతున్న స్విమ్స్(SWIMS), రుయ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరమర్శించనున్నారు. కాగా పవన్ వెంట టీటీడీ బోర్డ్ మెంబర్ ఆనంద్‌సాయి ఇతర అధికారులు ఉన్నారు.