AP News:డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో భారీగా కల్తీ నెయ్యి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కల్తీ నెయ్యి పట్టుబడటంతో కలకలం రేగింది.

Update: 2024-10-25 11:50 GMT

దిశ,పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కల్తీ నెయ్యి పట్టుబడటంతో కలకలం రేగింది. పిఠాపురంలోని స్థానిక లయన్స్ క్లబ్ ఏరియాలో ఓ ఇంట్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం నడుస్తోంది. ఇక్కడే డబ్బాలలో దాచిన కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. కల్తీ నెయ్యి తయారవుతుందన్న సమాచారంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించి 47 డబ్బాలలో దాచిన కల్తీ నెయ్యిని పట్టుకున్నారు. సంబంధిత తయారీదారులపై కేసు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.

జంతువుల ఎముకలతో తయారు చేసిన ఇటువంటి కల్తీ నెయ్యి దీపారాధనకు ఉపయోగించి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని హిందూ సంఘ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఈ కల్తీ నెయ్యిని ఆహార పదార్థాలలో ఉపయోగిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలాకాలం నుంచి ఇక్కడ కల్తీ నెయ్యి తయారవుతున్నట్టు తెలిసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు. పిఠాపురంలో ఇంకా పలు కేంద్రాలలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.


Similar News