Snake: స్కూల్లో పాము హల్‌చల్.. హడలిపోయిన విద్యార్థులు

విశాఖపట్నం గాజువాక ములగాడ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో పాముప్రత్యక్షమైంది..

Update: 2024-10-25 13:48 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం గాజువాక ములగాడ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల(Mulagada GVMC Primary School)లో పాము(Snake) ప్రత్యక్షమైంది. రాత్రి సమయంలో స్థానిక అటవీ ప్రాంతం(Forest Area) నుంచి తరగతి గదిలోకి వెళ్లింది. ఉదయం తరగతి గది తలుపులు తీసిన విద్యార్థుల(Students)కు పాము కనిపించడంతో హడలి పోయారు. క్లాస్ రూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రిన్సిపల్‌ ద్వారా స్నేక్ క్యాచర్‌(Snake Catcher)కు సమాచారం అందించారు. దీంతో ఆయన స్కూలు వద్దకు వెళ్లి పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. దీంతో స్కూలు సిబ్బంది, విద్యార్థులు ఊపరి పీల్చుకున్నారు. పాము కనిపిస్తే చంపొద్దని, తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News