ఘోర విషాదం.. కొడుకు హిజ్రాను ప్రేమించాడని పేరెంట్స్ ఆత్మహత్య

రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-12-25 10:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో కొందరు తల్లిదండ్రులు కొడుకు/కూతురు ప్రేమ వివాహానికి అంగీకరించి ఘనంగా పెళ్లి జరిపించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక మరికొందరైతే పరువు గురించి ఆలోచిస్తూ.. అసలు ప్రేమ వివాహం అంటేనే సహించారు. ఈ క్రమంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా ప్రేమ పెళ్లికే చాలామంది పెద్దలు ఒప్పుకోరు.. అటువంటిది ఓ హిజ్రాను ప్రేమించడం ఒప్పుకుంటారా? తాజాగా ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. ఏపీలోని నంద్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హిజ్రాతో కొడుకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని SBI కాలనీలో సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల కొడుకు సునీల్ బీటెక్ ఫస్టియర్ ఫెయిలై ఆటో డ్రైవర్లతో తిరుగుతున్నాడు. ఈ తరుణంలోనే ఓ హిజ్రా తో చనువుగా ఉంటున్నాడని పేరెంట్స్ అతడిని మందలించారు. ఈ క్రమంలో హిజ్రా గ్యాంగ్ వారి షాపు వద్దకు వచ్చి బూతులు తిడుతూ హంగామా చేశారు. దీంతో అవమానం భరించలేక తల్లిదండ్రులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది.. అప్పటికే పరిస్థితి విషమించడంతో దంపతులిద్దరూ మృతి చెందారు.


Similar News