Palnadu: జగన్ తండ్రి పేరు పెట్టుకొని పైసా పని చేయలేదు; జీవీ ఆంజనేయులు

కరువు నివారణ ప్రాజెక్టు పేరు మార్పుపై ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

Update: 2024-08-10 11:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కరువు నివారణ ప్రాజెక్టు పేరు మార్పుపై ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరు మార్పును స్వాగతిస్తున్నామని అన్నారు. జగన్ కరువు నివారణ ప్రాజెక్టుకు తండ్రి పేరు పెట్టుకొని కూడా పైసా పని చేయలేదని, గత తేదేపా హాయాంలోనే పనులు మొదలయ్యాయని చెప్పారు. జగన్ ఐదేళ్లలో పథకం పేరు మార్చడం తప్ప పల్నాడుకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఇక పెన్నా- గోదావరి నదుల అనుసంధానంతో కరువు రహిత పల్నాడును సాధిస్తామని జీవీ తెలిపారు. 

Tags:    

Similar News