దీపావళిని వినూత్నంగా జరుపుకున్న పాలకొల్లు MLA

పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు విన్నూత్న రీతిలో దీపావళి పండుగ జరుపుకున్నారు. టిడ్కో లబ్దిదారుల వద్దకు వెళ్ళి వారితో మమేకమై పండగ జరుపుకున్నారు.

Update: 2022-10-25 04:41 GMT

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు విన్నూత్న రీతిలో దీపావళి పండుగ జరుపుకున్నారు. టిడ్కో లబ్దిదారుల వద్దకు వెళ్ళి వారితో మమేకమై పండగ జరుపుకున్నారు. వారికి ఆంధ్రా పిండివంటలు వండించి పెట్టారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ... పగలనకా, రాత్రినకా కష్టపడుతున్న 7000 మంది టిడ్కో లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు.


Similar News