ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది...

Update: 2024-10-19 17:18 GMT

దిశ, వెబ్ డెస్క్: అరేబియా సముద్రం(Arabian Sea)లో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతం నుంచి ఉపరిత ద్రోణి కొనసాగుతోంది. దీంతో దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరం వరకు ద్రోణి ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీ(Ap)లో ఆదివారం సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వెల్లడించింది. వర్షాల కారణంగా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తు ప్రదేశాలకు వెళ్లాలని తెలిపింది. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ(Meteorology Department) హెచ్చరించింది. 


Similar News