ఆడుకుంటూ సైకిల్ టూబ్ వాల్ పిన్ మింగిన ఏడాది బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

విజయనగరం జిల్లా రాజాంలో ఆడుకుంటూ ఏడాది బాలుడు సైకిల్ టూబ్ వాల్ పిన్ మింగేశాడు..

Update: 2025-03-09 12:22 GMT
ఆడుకుంటూ సైకిల్ టూబ్ వాల్ పిన్ మింగిన ఏడాది బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చిన్న పిల్లలు వాళ్లకు దొరికిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారు. చప్పరించి ఊసేస్తుంటారు. కొన్ని సమయాల్లో మింగేస్తారు. మరీ చిన్న వస్తువులు అయితే కడుపులోకి వెళ్లి విసర్జన్ బయటకు వస్తాయి. కానీ అవి పెద్దగా ఉండి, అదీ గట్టి ఉంటే మాత్రం ప్రమాదంలో పడతారు. వాళ్లకే తెలియకుండా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. కొన్ని సమయాల్లో ఆస్పత్రి పాలవుతారు. వైద్య చికిత్సలతో ప్రమాదం నుంచి బయట పడతారు.  అయితే ఇలాంటి ఘటన ఒకటి తల్లిదండ్రులను టెన్షన్ పెట్టింది. 


విజయనగరం జిల్లా(Vijayanagaram) రాజాం(Rajam)లో ఏడాది బాలుడు(One Year Boy) ఇంటి దగ్గర ఆడుకుంటూ సైకిల్ ట్యూబ్ వాల్ పిన్(Bicycle tube wall pin) మింగేశాడు. దాంతో గొంతు(Throat)లో ఇరుక్కుపోయి అల్లాడిపోయాడు. కొద్దిసేపటికి అస్వస్థత(Illness)కు గురయ్యాడు. తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్యులు ఎండోస్కోపి(Endoscopy) చేశారు. బాలుడి అన్నవాహిక(Esophagus)లో వాల్ పిన్ ఉన్నట్లు గుర్తించారు. జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.

అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. చిన్న చిన్న వస్తువులను వాళ్లకు ఇవ్వొద్దని తెలిపారు. ఇంట్లో అలాంటి వస్తువులు ఉంటే తీసివేయాలని చెప్పారు. చిన్న చిన్న గట్టి వస్తువులు పిల్లలు నోట్లో పెట్టుకుంటుంటే వెంటనే తీసుకోవాలన్నారు. పిల్లల విషయంలో అప్రమత్తతంగా లేకపోతే పెను ప్రమాదాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు

Tags:    

Similar News