AP Haj Tour :హజ్ యాత్రకు మరోసారి దరఖాస్తు గడువు పొడిగింపు

హజ్ యాత్ర కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువును(Application Deadline) హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది.

Update: 2024-09-25 02:09 GMT

దిశ,వెబ్‌డెస్క్:హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. హజ్ యాత్ర కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువును(Application Deadline) హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. హజ్ దరఖాస్తుకు కేంద్ర హజ్​కమిటీ మొదట ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 9 అప్లికేషన్​కి అవకాశం కల్పించింది. ఈ గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో తాజాగా దరఖాస్తు గడువును(Application Deadline) మరోసారి ఈ నెల 30వ తేదీ వరకు మరోసారి కేంద్ర హజ్​కమిటీ పొడిగించినట్లు మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్(NMD Farooq) తెలిపారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్‌ లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర హజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేసిందన్నారు. ఏపీ నుంచి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటివరకు 1,937 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.


Similar News