AP News:భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంట.. పరిశీలించిన అధికారులు

తుఫాను, పెను గాలుల వల్ల నేల బారిన పడిన వరి పంటను మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి శనివారం పరిశీలించారు.

Update: 2024-10-19 10:00 GMT

దిశ ప్రతినిధి, నంద్యాల సిటీ: తుఫాను, పెను గాలుల వల్ల నేల బారిన పడిన వరి పంటను మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి శనివారం పరిశీలించారు. మండలంలోని బొల్లవరం, తమ్మడపల్లి, నందిపల్లి తదితర గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించి రైతులకు కొన్ని సూచనలు చేశారు. మరికొన్ని రోజుల పాటు తుఫాను పెను గాలులు వీచే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు. ఏ గ్రామంలో ఎంత పంట నష్టం జరిగింది అనేది పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదికలు పంపుతామన్నారు. ఆయన వెంట గ్రామ వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్, వీఆర్వో మాధవరావు తలారి కట్టుబడి ఖాజా హుస్సేన్ రైతులు పాల్గొన్నారు.


Similar News