AP News:మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు..వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

ఏపీలో ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే. ఫైల్స్ దగ్ధం కేసులో రెవెన్యూ శాఖ విచారణను ముమ్మరం చేసింది.

Update: 2024-07-28 07:51 GMT
AP News:మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు..వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే. ఫైల్స్ దగ్ధం కేసులో రెవెన్యూ శాఖ విచారణను ముమ్మరం చేసింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఉన్నతాధికారులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా ఇంట్లో పోలీసులు నోటీసులు అందించారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. బెంగళూరులో ఉన్న ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, పలువురు వైసీపీ నేతలను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News