కొడాలి నాని బొటన వేలుపై వెంట్రుక కూడా పీకలేవు: లోకేశ్‌పై మంత్రి కారుమూరి ధ్వజం

ధాన్యం కొనుగోళ్ల‌పై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు.

Update: 2023-08-27 12:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ధాన్యం కొనుగోళ్ల‌పై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు.చంద్ర‌బాబు హ‌యాంలో కంటే వైఎస్ జ‌గ‌న్ నాలుగేళ్ల పాల‌న‌లోనే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశార‌ని, ఆర్బీకే వ్య‌వ‌స్థ ద్వారా రైతు పండించిన ప్ర‌తి ధాన్యం గింజ‌ను గిట్టుబాటు ధ‌ర‌కు కొనుగోలు చేశామ‌ని స్పష్టం చేశారు. రైతుల‌కు మంచి చేస్తున్న తమ ప్ర‌భుత్వంపై ఎల్లో మీడియా నిత్యం విషం చిమ్ముతుందని మంత్రి కారమూరి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో రైతుల దగ్గర నుంచి 17.94 లక్షల రైతుల నుంచి 2.65 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి రూ.40,236 కోట్లు చెల్లింపులు చేస్తే నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ 32.78 లక్షల రైతుల నుంచి 3.10 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.58,765 కోట్లు చెల్లింపులు చేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు ఎంత దుర్మార్గం చేశారో.. రైతులకు తెలుసునన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. 2014 ఇన్‌పుట్ సబ్సిడీ కూడా సీఎం వైఎస్ జగన్ వచ్చాకే ఇచ్చారు. ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్‌స్యూరెన్స్‌లు ఆ పంట కాలంలోనే ఇస్తున్నాం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

దొంగ ఓట్లు చేర్పించడంలో చంద్రబాబు దిట్ట

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దారుడు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. టీడీపీని, ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను దుర్మార్గంగా దోచుకున్న దొంగ చంద్రబాబు అని మండిపడ్డారు. దొంగ ఓట్లు చేర్పించటంలో కూడా చంద్రబాబు దిట్ట అని.. ఇప్పుడు ఆధార్‌ ద్వారా ఆన్‌లైన్‌ సిస్టం రావటంతో దొంగ ఓట్ల బండారం బయటపడింది. దొంగ ఓట్ల కారకుడైన దొంగ చంద్రబాబేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. 600కి పైగా హామీలు ఇచ్చి మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి మాయం చేశారు అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారు.సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళల హామీని నెరవేరుస్తూ నాలుగు సార్లు సాయం అందించారు అని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్‌ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తుంటే.. కేసులు, రౌడీషీట్లు పెట్టించుకోమని లోకేశ్ అంటున్నాడు. పెద్దరికం, చిన్నరికం లేకుండా ఈ సుద్దపప్పు ఏం మాట్లాడుతున్నారు. కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని చెబుతున్నారు. ఏ కన్న తల్లి బిడ్డలపై కేసులు పెట్టించుకోమని ఎలా చెబుతావు అని లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తానో.. చెప్పారు. మీరు ఏం చెబుతున్నారు. ఒకాయన తాట తీస్తాను.. తోలు తీస్తాను, బట్టలు విప్పి కొంటాను అంటారు. చంద్రబాబు ఏమో.. చర్మం తీస్తాను, తోక కట్ చేస్తాను, మీ సంగతి తీస్తాను అంటారు. లోకేశ్ ఏమో.. ఎర్ర డెయిరీ పట్టుకుని.. మీ అందరి సంగతి రాస్తాను అంటావు. కొడాలి నాని బొటన వేలుపై వెంట్రుక కూడా పీకలేవు. ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నావు. నిన్ను చూస్తుంటే ఉత్తర కుమారుడే గుర్తుకు వస్తున్నావు. ఇలాంటి మాటలు మారుకోకపోతే.. ప్రజలు బుద్ధి చెబుతారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు.

Tags:    

Similar News