Assembly Deputy Speaker Post:నామినేషన్ దాఖలు చేసిన RRR
రాష్ట్రంలో నిన్న(మంగళవారం) జరిగిన ఎన్డీయే లేజిస్టేటివ్ సమావేశం(Legislative Assembly)లో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ స్పీకర్‌తో పాటు ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్‌ల నియామించిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిన్న(మంగళవారం) జరిగిన ఎన్డీయే లేజిస్టేటివ్ సమావేశం(Legislative Assembly)లో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ స్పీకర్‌తో పాటు ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్‌ల నియామించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) రఘురామకృష్ణంరాజును(Raghurama Krishnam Raju) ప్రకటిచండం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణం రాజు నామినేషన్ దాఖలు చేశారు. NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ పదవికి ఇంకెవరు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ పదవికి ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రేపు(గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు ఉప సభాపతి పదవికి రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.