దానా తుఫాన్ తీవ్ర రూపం.. ఏపీకి బిగ్ అలర్ట్
వాయువ్య బంగాళాఖాతంలో దానా తుఫాన్ తీవ్ర రూపం దాల్చిందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది..
దిశ, వెబ్ డెస్క్: వాయువ్య బంగాళాఖాతంలో దానా తుఫాన్(Dana Typhoon) తీవ్ర రూపం దాల్చిందని విశాఖ వాతావరణ శాఖ(Visakha Meteorological Department) వెల్లడించింది. ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ కదులుతోందని, శుక్రవారం అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ఒడిశాలోని భీతరకనిక నుంచి వేగంగా కదులుతూ పశ్చిమ బెంగాల్ దామర వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఒడిషా, బెంగాల్(Odisha, Bengal)పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమయంలో ఉత్తర కోస్తాలో గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంగా బలమైన ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. విశాఖ నుంచి భువనేశ్వర్ వైపు వెళ్ళే 42 ట్రైన్స్‌ను అధికారులు రద్దు చేశారు. శుక్రవారం సైతం 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.