Government:న్యూయర్ కానుక.. వారికి నెలలోపే కొత్త పెన్షన్!

ఏపీ ప్రభుత్వం(AP Government) పింఛన్ల పై మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-12-28 10:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Government) పింఛన్ల పై మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల పింఛన్లు ఒకటో తేదీ కంటే ఒకరోజు ముందు నుంచే పంపిణీ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వం పెన్షన్ దారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

వివరాల్లోకి వెళితే.. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అదే నెలలోనే భార్యకు ప్రభుత్వం పెన్షన్ అందించనుంది. నవంబర్ 1 నుంచి ఈ నెల 15 మధ్య వితంతువులుగా మారిన 5,402 మందికి స్పౌజ్ కేటగిరీ(Spouse Category)లో ఈ నెల 31న రూ.4 వేల చొప్పున పంపిణీ(Distribution of pensions) చేయనుంది. అలాగే 3 నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని దాదాపు 50 వేల మందికి 2, 3 నెలల మొత్తాన్ని ఒకేసారి అందివ్వనుంది. న్యూయర్ కానుకగా ఒక రోజు ముందే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News