ఏపీ సీఎంకి ఆ జబ్బు ఉంది.. అందుకే బయటకు రావడం లేదు.. నారా లోకేష్
ఈ రోజు సాలూరులో నారా లోకేష్ శంఖారావం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు సాలూరులో నారా లోకేష్ శంఖారావం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సభలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డైయేరియా అని అందుకే బయటకు రావడం లేదని ఎద్దేవ చేశారు. తాను వైసీపీ కార్యాలయానికి ఫోన్ చేసి జగన్ బయటకు ఎందుకు రావడం లేదని అడగగా.. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే నీళ్లు తాగడంవల్ల ముఖ్యమంత్రికి లూస్ మోషన్స్ అవుతున్నాయని కార్యాలయ సిబ్బంది చెప్పారంటూ లోకేష్ హాస్య చతురోక్తులు విసిరారు.
కనీసం సురక్షితమైన త్రాగు నీరు కూడా ఇచ్చే పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం లేదంటే ఎంత చెత్త ప్రభుత్వమో అర్ధం చేసుకోవాలి అని సూచించారు. గుంటూరు జిల్లాలో డైయేరియ వల్ల ఇద్దరు చనిపోయారని.. వందలాది మంది ఆసుపత్రిలో చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది ప్రజలు కలుషితమైన నీరు తాగి ఆసుపత్రి పాలైతే ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేశారా..? అలానే ఆరోగ్యశాఖ మంత్రి ఒక్క సమీక్ష చేశారా అని ప్రశ్నించారు.
అసలు ఈ ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం అని దుయ్యబట్టారు. అలానే ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని ముళ్ళు కర్ర తీసుకొని కోట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని పేర్కొన్నారు. ఇక జగన్ కి సినిమా పిచ్చి ఎక్కువైంది అని.. అయితే ఆ వంకర నవ్వుతో సినిమాల్లో చెయ్యలేరని.. కానీ ఆయన రేంజ్ పెంచుకునేందుకు వ్యూహం, యాత్ర సినిమా తీసారని తెలిపారు. ఇక ఈ మధ్య వచ్చిన యాత్ర 2 సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని పేర్కొన్నారు.
దీనితో యాత్ర 2 సినిమా తీసిన నిర్మాత తాను నష్టపోయంటూ సాయం చేయాల్సిందిగా జగన్ కోరారని.. అయితే అందుకు జగన్ నష్టపోయింది నువ్వు నేను కాదు అన్నారని.. దీనితో ఆగ్రహానికి గురైన నిర్మాత అంతిమ యాత్ర సినిమా తీస్తానని అంతిమ యాత్ర పోస్టర్ ను జగన్ కు చూపించగా జగన్ వణికిపోయారని ఎద్దేవ చేశారు. ఇక నిర్మాతకి వచ్చిన నష్టాన్ని పూడ్చేదానికి ఎన్నడూ లేని విధంగా హార్స్లీ హిల్స్ లో విలువైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రొడ్యూసర్ పేరు పై రాసారని మండిపడ్డారు.
మీ పేరు పైన సినిమా తీసుకున్నారుగా.. ఆ నిర్మాత నష్టం పూడ్చడానికి మీ ఇల్లే ప్రొడ్యూసర్ పేరుపై రాయొచ్చుగా..? లేదా యుడుపులపాయలో మీకున్న వందల ఎకరాల్లో రెండు ఎకరాలు ఆ ప్రొడ్యూసర్ కి ఇవ్వొచ్చుగా..? అని సభాముఖంగా ప్రశ్నించారు.
Read More..
ఏపీ సీఎంకి ఆ జబ్బు ఉంది.. అందుకే బయటకు రావడం లేదు.. నారా లోకేష్