అనంతలోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు!

అనకాపల్లి రహదారుల దుస్ధితిపై తెలుగుదేశం యువనేత నారా లోకేష్ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు...

Update: 2024-02-19 15:26 GMT

దిశ ప్రతినిధి, విశాఖటప్నం: అనకాపల్లి రహదారుల దుస్ధితిపై తెలుగుదేశం యువనేత నారా లోకేష్  సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇది అనకాపల్లిలోని ప్రధాన రహదారి. జగన్మోహన్ రెడ్డి జమానాలో గోతుల్లో రోడ్డు ఎక్కడుందా అని వెదుక్కోవాల్సి వస్తోంది. ఈ రోడ్లపై ప్రయాణిస్తే గర్బిణీలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. చేతగాని ముఖ్యమంత్రి సిగ్గు, లజ్జా లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నానని డబ్బాలు కొట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు 1.80 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో టెండర్లు పిలచినా ఈ సీఎం ముఖం చూసి రోడ్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను పంచాయితీరాజ్ మంత్రిగా పని చేసిన మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 25వేల కి.మీ సిసి రోడ్లు వేయించాను. భస్మాసురుడు జగన్ పాలనలో 4.10 ఏళ్లుగా రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు. మరో 2 నెలల్లో రాబోయే టిడిపి-జనసేన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లన్నింటినీ బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.’ అని లోకేశ్ పేర్కొన్నారు

Tags:    

Similar News