ఉరవకొండ శంఖారావం సభలో వైసీపీపై నారా లోకేష్ ఫైర్

ఉరవ కొండ శంఖారావం సభలో నారా లోకేష్ వైసీపీపై ఫైర్ అయ్యారు.

Update: 2024-03-10 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉరవ కొండ శంఖారావం సభలో నారా లోకేష్ వైసీపీపై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో వందల కిలో మీటర్ల రోడ్లు వచ్చాయన్నారు. టీడీపీ హయాంలోనే పెద్ద ఎత్తున తాగు, సాగునీటి పనులు జరిగాయన్నారు. పయ్యావుల.. ఉరవకొండకు మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించారన్నారు. ఉరవకొండలో 3 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు. నియోజకవర్గానికి 18 వేళ ఇళ్లను పయ్యావుల సాధించారన్నారు. జగన్ వచ్చాక ఉరవకొండలో పది శాతం పనులు కూడా జరగలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచేస్తున్నారన్నారు. నకిలీ ఆధార్ కార్డులు.. పత్రాలతో భూములు కాజేస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. 80 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారని.. కనీసం 8 ఎకరాలకు సాగు నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు.


Similar News