గంగమ్మ దేవత, నాగాలమ్మ దేవతలకు నారా భువనేశ్వరి పూజలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చంద్రగిరిలో పర్యటిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చంద్రగిరిలో పర్యటిస్తున్నారు. ఈనెల 25న నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం సొంత జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారి పల్లె నుంచే ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా నారావారిపల్లెలో చంద్రబాబు కుల దైవం గంగమ్మ దేవత, నాగాలమ్మ దేవతకు నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్తమామలు కర్జూర నాయుడు, అమ్మణమ్మ సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత నారావారిపల్లిలో గ్రామస్థులు, మహిళలు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేసిన వారు....త్వరలో మంచి జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని భువనేశ్వరికి సూచించారు. ఇకపోతే మంగళవారం ఉదయం నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం రోడ్డు మార్గం గూండా భువనేశ్వరి నారావారి పల్లెకు వెళ్లిన సంగతి తెలిసిందే.