విజయవాడలో వరద బీభత్సం.. 2.76 లక్షల మందిపై ఎఫెక్ట్
విజయవాడలో మున్నేరు, బుడమేరు వాగు బీభత్సం సృష్టించాయి....
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో మున్నేరు, బుడమేరు వాగు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఒక్కసారిగా ఉప్పొంగి విజయవాడ సిటీపై విరుచుకుపడ్డాయి. దీంతో నగరంలో అన్ని బస్తీలు వరద నీటితో నిండిపోయాయి. నగర వ్యాప్తంగా 2.76 మంది వరద బాధితులుగా మిగిలారు. ఇళ్లలో నీరు చేరడంతో ఎత్తు ప్రాంతాలు, బిల్డింగులపై తల దాచుకున్నారు. ఆహారం, భోజనం లేక సాయం కోసం ఎదురు చేస్తున్నారు.
దీంతో వరదలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. వరద బాధితులందరికి మంచి నీరు, భోజనం, పాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని వరద ప్రాంతాలకు పంపారు. రాత్రి సమయం కూడా సహాయ చర్యలు అందించాలని ఆదేశించారు. సోమవారం మరోసారి విజయవాడ సిటిలోకి వరద నీరు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. వరద బాధితులకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించి అన్ని సరి చేసిన తర్వాతనే ఇళ్లకు తరలించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. విజయవాడకు ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇదే తొలిసారి అని, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంప్రాంతాలకు వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.