Breaking: సీఐడీకి నటి కాదంబరి జత్వానీ కేసు
ముంబై నటి జత్వానీ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.....
దిశ, వెబ్ డెస్క్: ముంబై నటి జత్వానీ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. కేసు వివరాలను ఇబ్రహీంపట్నం పోలీసులు సీఐడీకి అందజేయనున్నారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ఈ కేసుపై మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తును ప్రారంభించనున్నారు. కాగా వైసీపీ హయాంలో నటి జత్వానీపై వేధింపులు, అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసు వెనుక వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని ప్రమేయం ఉందని విచారణలో తేలింది. దీంతో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ కేసును సీఐడీకి అప్పగించాలన్న డిమాండ్‌తో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.