Pulivendula: ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి ఊరట
ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి ఊరట లభించింది...
దిశ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి(Raghava Reddy)కి ఊరట లభించింది. ఈ నెల 12వరకూ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై ఆరోపణలున్నాయి. దీంతో విచారణకు రావాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కానీ రాఘవరెడ్డి 20 రోజులుగా పరారీలో ఉన్నారు. సెడన్‌గా ఆదివారం పులివెందుల(Pulivendula)లో ప్రత్యక్షమయ్యాయి. అయితే హైకోర్టు(High Court)లో ముందస్తు బెయిల్(Anticipatory Bail Petition) పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. రాఘవరెడ్డి పులివెందులలో ప్రత్యక్షమైన విషయం తెలుసుకున్న పోలీసులు.. విచారణకు రావాలని కోరగా.. నోటీసు ఇస్తేనే వస్తానని రాఘవరెడ్డి తెలిపారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.