CM Chandrababu : రాష్ట్రంలో రూ.6 వేల కోట్లకు పైగా, విద్యుత్ పనులకు శ్రీకారం : ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) వ్యాప్తంగా రూ.6వేల కోట్లకు పైగా విద్యుత్తు రంగం పనులకు శ్రీకారం చుట్టినట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) వెల్లడించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) వ్యాప్తంగా రూ.6వేల కోట్లకు పైగా విద్యుత్తు రంగం పనులకు శ్రీకారం చుట్టినట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతానికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం తాళ్లాయపాలెంలో జీఐఎస్ 400/220కేవీ సబ్ స్టేషన్‍ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు చేసిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ కావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ సబ్ స్టేషన్ల పనులన్నీ ఏడాది కాలంలో పూర్తి చేస్తామని, ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. బేతంచర్ల 220/132/33కేవి, పెనుగొండలో 220/132 కేవీ, గోరంట్ల, పుట్టపర్తి మండలాలకు, హంసవరం 132/33కేవీ తుని రూరల్, శంఖవరం, మైలవరం, జీ.కొండూరు, వీ.కోట, బైరెడ్డి పల్లి సహా 10జిల్లాలకు సంబంధించి 12సబ్ స్టేషన్లు, ట్రాన్స్ మీటర్ల ఏర్పాటు పనులకు శంకుస్ధాపన చేసుకున్నామన్నారు.
అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్ కు విద్యుత్తు వినియోగదారులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆయా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం తాళ్లాయపాలెం నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారని, తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220కేవీగా అప్ గ్రేడ్ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి సరఫరా తీసుకుంటారని తెలిపారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు పరిశ్రమలకూ అంతరాయం లేని విద్యుత్తు సరఫరాకు తోడ్పడుతుందన్నారు.
Read More..
CM Chandrababu: అమరావతిని ఎడారిగా మార్చేశారు.. సీఎం చంద్రబాబు ఫైర్