ఏపీపై రుతుపవనాల ఎఫెక్ట్.. మరో 24 గంటలు వర్ష సూచన
ఏపీపై రుతుపవనాల ప్రభావం సాధారణంగా కొనసాగుతోంది..
దిశ, వెబ్ డెస్క్: ఏపీపై రుతుపవనాల ప్రభావం సాధారణంగా కొనసాగుతోంది. దీంతో రానున్న 24 గంటలు ఉత్తరాంధ్రకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. శ్రీకాకుళం కళింగపట్నంలో 10 సెం.మీ. వర్షపాతం నమోదు అయినట్లు తెలిపింది. విశాఖలో 9, టెక్కలి, యలమంచిలిలో 4 సెం.మీ. వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటలపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, పశువుల కాపర్లు వర్షాలు పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.