జనసేన ఎమ్మెల్యేకు కారును గిఫ్టుగా ఇచ్చిన కార్యకర్తలు.. సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం ఎమ్మెల్యేగా సామాన్య జనసేన కార్యకర్త అయిన చిర్రి బాలరాజు గెలుపొందారు.

Update: 2024-07-02 16:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం ఎమ్మెల్యేగా సామాన్య జనసేన కార్యకర్త అయిన చిర్రి బాలరాజు గెలుపొందారు. అయితే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతుండటం తో జనసేన కార్యకర్తలు అందరూ కలీసి ఓ కారును డౌన్ పేమెంట్ కట్టి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ గా మారింది. అయితే ఎమ్మెల్యే బాలరాజు మాత్రం కార్యకర్తలు ఇచ్చిన గిఫ్ట్ ను తిరస్కరించారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఎమ్మెల్యే ఆ వీడియో లో ఇలా అన్నారు. "మీ ప్రేమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీరిచ్చిన బహుమతిని సున్నితంగా తిరస్కరిస్తున్నాను. నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన గెలుపే నాకు అతి పెద్ద బహుమతి" అంటూ చెప్పుకొచ్చారు.

Similar News