దసరా ఉత్సవాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

పట్టణంలోని మున్సిపల్ మైదానంలో విజయదశమి శరన్నవరాత్రుల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే దసరా ఉత్సవాలకు మంగళవారం ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి భూమి పూజ చేశారు.

Update: 2024-10-01 12:19 GMT

దిశ, ఆదోని రూరల్: పట్టణంలోని మున్సిపల్ మైదానంలో విజయదశమి శరన్నవరాత్రుల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే దసరా ఉత్సవాలకు మంగళవారం ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి భూమి పూజ చేశారు. శ్రీ రాజయోగి పంచలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య భారతి స్వామి, గురు సిద్ధ స్వామి , రామ నారాయణ స్వామి వారి చేతుల మీదుగా జరిగిన భూమి పూజ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మైదానంలో జరిగే పూజా కార్యక్రమాల్లో మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో నియోజకవర్గ ప్రజలంతా కూడా పాల్గొనాలని వారన్నారు. ఉత్సవ సమితి సభ్యులు కనిగిరి నీలకంఠ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం హోమ కార్యక్రమం జరుగుతుందని హోమ కార్యక్రమంలో పాల్గొనే దంపతులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు ఉపేంద్ర కుమార్, బసవరాజు, నాగరాజు గౌడ్, సాయి ప్రసాద్, అంజయ్, శ్రీకాంత్, సంజీవ్, వర్మ, లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.


Similar News