AP టీడీపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన MLA పల్లా

ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్‌గా నియామకమైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సీఎం, టీడీపీ చీఫ్

Update: 2024-06-16 16:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్‌గా నియామకమైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో శ్రీనివాస్ రావు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కొత్త బాధ్యతలను శ్రీనివాస్ రావు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడికి ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్న కృషి చేశారని కొనియాడారు.

కాగా, ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు కేబినెట్‌లో మొన్నటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చూసిన అచ్చెన్నాయుడికి చోటు దక్కింది. మంత్రి పదవి దక్కడంతో ఏపీ టీడీపీ చీఫ్ పదవికి అచ్చెన్నాయుడు రిజైన్ చేశారు. దీంతో ఈ పోస్ట్‌ను ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావుకు చంద్రబాబు అప్పగించారు. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీ చీఫ్‌గా ఇవాళ శ్రీనివాస్ రావు బాధ్యతలు స్వీకరించారు.  


Similar News