Ahobilam Temple : అహోబిలంలో అపచారం..ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలం(Ahobilam Temple)లో అపచారం(Misconduct)చోటుచేసుకుంది. ఆలయ సిబ్బందినే ఆలయ నియామాలను పాటించకపోవడంతో తగిన మూల్యం చెల్లించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలం(Ahobilam Temple)లో అపచారం(Misconduct)చోటుచేసుకుంది. ఆలయ సిబ్బందినే ఆలయ నియామాలను పాటించకపోవడంతో తగిన మూల్యం చెల్లించారు. కొంతమంది ఆలయ సిబ్బంది దేవాలయం సమీపంలో మాంసాహారం, మద్యం సేవించారు. ఈ ఘటన వీడియో వైరల్ గా మారడంతో విచారణ జరిపిన దేవస్థానం మేనేజర్ ఐదుగురు ఆలయ సిబ్బందిని సస్పెండ్ (Five Temple Staff Suspended)చేశారు.
డ్యూటీ సమయంలో మాంసాహారం మద్యం సేవించటం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్క్కటైన అహోబిలం నరసింహ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కి. మీ దూరం లో ఉంది. నారాయణుడు ఉగ్రనరసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రం ఇదేనని స్థల పురాణం చెబుతుంది.
హిరణ్యకశపుని వధ అనంతరం నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో బలం, అహోబలం అని ఆశ్చర్యంతో స్త్రోతం చేయడంతో ఈ క్షేత్రానికి అహోబిలంన రసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చిందని స్థల పురాణం. అటువంటి పుణ్య క్షేత్రంలో ఆలయ సిబ్బందినే అపచార చర్యలకు పాల్పడటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.