‘వైఎస్ జగన్ తీరుతో ప్రజలు బాధపడుతున్నారు’..మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

వరదల అంశాన్ని మళ్లీంచేందుకే వైసీపీ నేతలను(YCP Leader) అరెస్ట్ చేస్తున్నారన్న మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Update: 2024-09-11 11:47 GMT

దిశ,వెబ్‌డెస్క్:వరదల అంశాన్ని మళ్లీంచేందుకే వైసీపీ నేతలను(YCP Leader) అరెస్ట్ చేస్తున్నారన్న మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు(Rains), వరద(Flood)లతో ప్రజలు అల్లాడుతుంటే కష్టపడి పని చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసత్యాలతో జీవిస్తున్నారని ప్రతిరోజూ నిరూపించుకుంటూనే ఉన్నారని విమర్శించారు.

బుడమేరు(Budameru) ఎక్కడ ఉంది..డైవర్షన్ కెనాల్, రెగ్యులేటర్ ఎక్కడ ఉన్నాయని జగన్‌ను ప్రశ్నించారు. గండ్లు ఎప్పుడు, ఎక్కడ పడ్డాయి. కృష్ణా నదీ ప్రవాహాలు ఎలా వచ్చాయనే అంశాలపై కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. టీడీపీ(TDP) ఆఫీసుపై దాడిని సమర్థించుకోవడం దారుణం అన్నారు. వరద(Flood)లతో జనం కష్టాల్లో ఉంటే జైలుకెళ్లి ఓ క్రిమినల్‌ను పరామర్శించిన జగన్‌కు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో వైసీపీకి 11 సీట్లు కూడా ఎందుకిచ్చామా? అని ప్రజలు బాధపడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.


Similar News