సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మంత్రి రోజా సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-02-26 15:09 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మంత్రి రోజా సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను యాంకర్ మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంటుంది ఎవరని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి రోజా.. సొంత పార్టీ నేతలనే తనను ఎదగకుండా చూస్తున్నారని.. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చూసే ప్రయత్నాలు చేస్తుండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

అలాగే తనకు అండగా జగనన్న ఉన్నాడని.. తనకు అన్యాయం చేయాలని చూసిన వారిని జగనన్న ఊరికే వదిలిపెట్టరని చెప్పుకొచ్చింది. అలాగే వచ్చే ఎన్నికల్లోను నగరి నుంచి తానే పోటీ చేస్తానని.. ఈ సారి కూడా కచ్చితంగా గేలుస్తానని రోజా చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాను టీడీపీలో ఉన్నప్పుడు తనపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసి బయటకు పంపించారని.. ఆ పార్టీ నేతల తీరుతో నేను ఆర్థికంగా రాజకీయంగా తీవ్ర స్థాయిలో నష్టపోయామని మంత్రి రోజా అన్నారు.


Similar News